కోనసీమ: భారతదేశాన్ని ప్రపంచ స్టార్టప్ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా నిర్వహించిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026’ కార్యక్రమంలో తనకు ఆహ్వానం అందటం సంతోషంగా భావించానని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. వ్యవసాయశీలత, ఆవిష్కరణలపై జాతీయ స్థాయిలో సాగుతున్న చర్చలో భాగస్వామి కావడం ఎంతో గర్వకారణమన్నారు.