ప్రకాశం: బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో ఆదివారం చిన్న రంగయ్యపై లాజరు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో చిన్న రంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట కంభం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. గతంలో జరిగిన గొడవ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.