VZM: బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే పీ4 ప్రధాన లక్ష్యం అని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. లక్కవరపుకోట మండలం కళ్ళేపల్లి, లచ్చంపేట గ్రామాలకు చెందిన రెండు పేద కుటుంబాల వివాహాలకు మండల అంజలి, చప్ప సౌజన్యకీ చెరో రూ.25,000 చొప్పున మొత్తం రూ.50,000 ఆర్ధిక సహాయం అందజేశారు.