BPT: పర్చూరు మండలం అడుసుమల్లి సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఆధార్ క్యాంప్ నందు కొత్త ఆధార్ నమోదు, పేరు చిరునామా ఫోన్ నెంబర్ వివరాలు అప్డేట్, ఐదు నుంచి 15 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అన్నారు.