అన్నమయ్య: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇవాళ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. మదనపల్లె నియోజకవర్గంలో 14.354 మందికి 4 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.