AKP: టీడీపీ శ్రేణులు పండగ వాతావరణంలో మహానాడును జరుపుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోటవురట్ల సినిమా హాల్ రోడ్డు కళ్యాణ మండపం, పాములవాక పట్టాలమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో రెండు చోట్ల ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని కోరారు. కోటవురట్లలో మహానాడు జరిగే కళ్యాణ మండపాన్ని ఆదివారం పరిశీలించారు.