NTR: విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ 14వ డివిజన్ దర్శిపేట 237వ బూత్ పరిధిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందచేశారు. ప్రభుత్వం మహిళలకిచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తోందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామన్నారు.