నెల్లూరులో మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్లను తీయమన్నందుకు గొడవపడి, బస్సును వెంబడించి మరీ బోసుబొమ్మ కూడలిలో డ్రైవర్ మన్సూర్, కండక్టర్ సలాంపై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.