BPT: భూ సేకరణకు సంబంధించిన కోర్టు కేసులలో కలెక్టరేట్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం న్యూ విసి హాల్లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో, కేసులను నిశితంగా పరిశీలించి, దస్త్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆయన గుర్తుచేశారు. సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి అన్నారు.