EG: తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విధులను బహిష్కరిస్తామని 108 ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం రాజమహేంద్రవరంలో డీఎంహెచ్ వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసుతో పాటు 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సీఎం ప్రకటించిన రూ.4 వేల అలవెన్స్‌లో కేవలం రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు.