SKLM: మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో ఆదివారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచేందుకు ఎంఈఓలు ఎస్.దేవేంద్రరావు,పద్మనాభరావు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలపై వివరించారు.