కృష్ణా: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గుడివాడ వన్ టౌన్ పోలీసులు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వన్ టౌన్ ఎస్సై సత్యనారాయణ, టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహన రికార్డులను పరిశీలించి జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాము సంఘటనా స్థలానికి చేరుకుని, స్వయంగా చలానా చెల్లించారు. ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటించాలని, అవి ప్రజా శ్రేయస్సుకొరకేనని తెలిపారు.