కోనసీమ: మకర సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఏసీ నాగవరప్రసాద్ తెలిపారు. ఆ రోజున స్వామి మూల మూర్తులకు, ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవలు జరుగుతాయని తెలిపారు. ఆలయం, ప్రాంగణాన్ని ముందుగానే శుద్ధి చేయాల్సి ఉన్నందున అభిషేకం, ద్వాదశి మాస ఆర్జిత కల్యాణం రద్దు చేశామన్నారు.