E.G: నిడదవోలు, చాగల్లు, పెరవలి మండలం కానూరు తపాలా కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తాడేపల్లి గూడెం పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ ఒక ప్రక టనలో తెలిపారు. ఈ కేంద్రాల్లో పేరు, చరవాణి నంబరు, పుట్టిన తేదీ, చిరు నామాల మార్పుతో పాటు, కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.