కోనసీమ: అమలాపురంలో ఆదివారం APSRTC అంబేద్కర్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి.సత్తిబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ జోనల్ అధ్యక్షుడు జి. చిరంజీవి మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు డిపోల్లో ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, స్థానిక అధికారులు పరిష్కారంలో చొరవ చూపడం లేదని ఆరోపించారు.