NTR: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గత 26 రోజుల హుండీ లెక్కింపు జరిగింది. దీని ద్వారా మొత్తం నగదు రూ.5,22,18,647/- లభించింది. అదేవిధంగా 415 గ్రాముల బంగారం, 7 కిలోల 465 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ సమకూరాయి. అమ్మవారి సేవలో భక్తుల అచంచల విశ్వాసానికి ఇదే నిదర్శనమని దేవస్థానం ఈవో శీనా నాయక్ తెలిపారు.