GNTR: డిప్యూటీ స్పీకర్, స్పీకర్, ఇప్పుడు మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి అభివృద్ధి కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. తెనాలిలో ఆయన శనివారం మాట్లాడుతూ.. మంత్రి నాదెండ్ల ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. దీపం పథకం కింద ఏ అర్హులకు లబ్ధి చేకూరలేదన్నారు.