AKP: ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో ముసలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యజ్జల ముసలమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి బంగారు చిట్టి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. శీతకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.