అన్నమయ్య: మదనపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. చౌడేపల్లికి చెందిన పాపయ్య(74), సుబ్రహ్మణ్యం(64) శనివారం బైక్పై బోయకొండ రోడ్డులో వెళ్తుండగా, ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.