కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.