E.G: పీల్డ్ స్థాయి సిబ్బంది తమ పనితీరు సరిచేసుకోవాలని, వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హెచ్చరించారు. శనివారం రాజానగరం ఎమ్మెల్యే కార్యాలయంలో DRDA -SERP అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు అర్హులకి అందే విధంగా చూడాలని, మహిళా సంఘాల పనితీరు మరింత పటిష్ట పరచాలని సూచించారు.