CTR: చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలు కవిత మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని YCP నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గురువారం ఆరోపించారు. ఆమె అదృశ్యంపై ఈనెల రెండున కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా టూ టౌన్ పోలీసులు పట్టించుకోలేదని వెల్లడించారు. దీని కారణంగానే ఆమె శవం లభ్యమైందన్నారు. దీనికి కారణం అయిన సిబ్బందిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.