KDP: కేంద్ర కారాగారంలో ఖైదీలకు కంటి పరీక్షలను నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు మాధవీలత, భారతి, నవీన్ శ్రీదేవిలు 165 మంది ఖైదీలకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సరిగా లేని వారికి కంటి అద్దాలు ఇచ్చారు. మరి కొందరికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారి రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.