CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ చిదంబరం తెలిపారు. ఈ జాబ్ మేళాకు డిగ్రీలో బీఎస్సీ చదివిన వాళ్లు అర్హులని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.