ప్రకాశం: యర్రగొండపాలెం మండలం పెద్ద కొలుకులలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి రైతు దొంత పెద్ద కాశయ్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మోటర్ స్టార్టర్కు విద్యుత్ సరఫరా కావడంతో రైతుకు విద్యుత్ షాక్ తగిలినట్టుగా స్థానిక రైతులు తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.