VSP: విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ అన్నారు. శుక్రవారం కళాశాల వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని పేర్కొన్నారు. గొప్ప సంస్కరణలు చేసిన సర్దార్ అడుగుజాడల్లో నడవాలన్నారు.