CTR: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానములో ఫిబ్రవరి 21 నుంచి 6 మార్చి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో బాపిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని.. 22న స్వామివారి ద్వజారోహణం, 26న మహాశివరాత్రి, రాత్రి లింగోద్భవం, 27న రథోత్సవం, మార్చి 1న కళ్యాణోత్సవం, 3న ద్వజా అవరోహణం, 5న పల్లకి సేవలు జరుగుతాయన్నారు.