VZM: ధాన్యం సేకరణను పకడ్బందీగా, వేగంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులు ఆదేశించారు. మంగళవారం ఆయన వేపాడ మండలంలో పర్యటించారు. ముందుగా బల్లంకి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది కొనుగోలు విధానం, తేమ కొలిచే ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు.