NTR: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, రంగస్థల అభివృద్ధి సంస్థ (APSFTVTDC) వైస్ ఛైర్మన్గా ఆదివారం విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.