ATP: తాడిపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సాయి ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. చుక్కలూరులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉండటంతో నారాయణ, పెద్దన్న, రఫీలను అదుపులోకి తీసుకోగా వారి వద్ద పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోన్నామన్నారు.