KDP: ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ నగేష్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన కౌన్సెలింగ్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.