ELR: ఆగిరిపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి సమయంలో బైకును పాల వ్యాను ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎస్సై శుభ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.