AKP: గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామారావు పేర్కొన్నారు. గ్రామాలలో కోడిపందాలకు, పేకాటకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు తిరిగే అవకాశం ఉన్నందువలన మహిళలు తమ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. బహిరంగ ప్రాంతాలలో మద్యం తాగకూడదని సూచించారు.