ELR: మర్లపాలెం గ్రామంలోని ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి, రూ.8.75 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. సోమవారం ఏడీఏ జీ. వెంకటమణి నిర్వహించిన తనిఖీలలో ఎరువుల నిల్వలకు రికార్డులకు పొంతన లేకపోవడంతో ఈ మేరకు అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఆయన తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని ఆయన సూచించారు.