కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం కడపలో ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా అమలు చేశారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ నేరాల నియంత్రణ, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అరికట్టడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు. హెల్మెట్, సీటుబెల్టు, డ్రంకెన్ డ్రైవింగ్‌పై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.