KDP: నగరంలో ఈ నెలలో వైభవంగా జరిగే ప్రఖ్యాత అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆహ్వానం అందించారు. జిల్లా పర్యటనకు వచ్చిన వెంకయ్య నాయుడును దర్గా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం తెలిపారు. దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ఆహ్వానించి దర్గా విశిష్టతను ఆయనకు తెలియాజేశారు.