PLD: తంగెడ గ్రామంలో ముగ్గు వేసే విషయంలో ఇరుగుపొరుగు (బంధువుల) మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిందని దాచేపల్లి సీఐ రాజేష్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని, దీనికి ఎలాంటి రాజకీయ ముద్ర వేయొద్దని సీఐ స్పష్టం చేశారు. కేసులేవీ నమోదు కాలేదని, గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, గ్రామస్తులు సంయమనం పాటించాలని కోరారు.