GNTR: మంగళగిరి నుంచి తిరుపతికి ప్రయాణించే వారి సౌలభ్యం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు డీఎం పిచ్చయ్య తెలిపారు. ప్రతి రోజు రాత్రి 8:15 గంటలకు మంగళగిరిలో బయలుదేరే ఈ బస్సు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తెల్లవారుజామున 5:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి, అదే రోజు రాత్రి 8:15 గంటలకు తిరుపతి నుంచి వస్తుంది.