NDL: కుల నిర్మూలన కోసం మహాత్మ జ్యోతిబాఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని నంద్యాలలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో కుల నిర్మూలన కోసం జ్యోతిబా ఫూలే ఎంతగానో కృషి చేశారని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రఫీ అన్నారు.