GNTR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ గ్రామ కూటమి నాయకులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షలు సేకరించారు. ఆ నగదును చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్కు శుక్రవారం అందజేశారు. ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో దాతల సాయం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.