NLR: మనుబోలులోని ఓ బ్యాంక్లో శుక్రవారం ఉదయం నుంచి సర్వర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. నెలలో రెండు మూడు దఫాలుగా ఇలానే జరుగుతుందని ఖాతాదారులు వాపోయారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవడం కోసం వస్తే సర్వర్ పని చేయక గంటల తరబడి ఎదురు చూడవలసి వస్తుందని వారు వాపోయారు.