బాపట్ల ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా ప్రకాష్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జే. వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలసి బొకేెను అందజేశారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా బాపట్ల జిల్లాలో సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా గిరిజనులకు అందే విధంగా కృషి చేయాలన్నారు.