SKLM: ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, వైసీపీ జిల్లా పరిశీలకులు తమ్మినేని సీతారాంను ఆయన కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ పురోగతిపై, ప్రస్తుత స్థితిగతులపై వివిధ అంశాలను చర్చించారు. పార్టీ శ్రేణులతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు పలు అంశాలు మాట్లాడారు.