కాకినాడ: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్లో ఉన్నానని, ఇలాంటి సమయంలో లేనిపోనివి ప్రచారం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నాననే మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. త్వరలో పార్టీ నేతలను కలుస్తానని చెప్పారు.