PLD: జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో రొంపిచర్లలో బుధవారం హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 350 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అందులో 25 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య సహాయకులు కే.మురళీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.