WG: గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం నుంచి విజయవాడ వరద బాధితుల కోసం జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించారు. ఈ సందర్భంగా సేకరించిన 700 కేజీల బియ్యాన్ని ఆదివారం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు దేవరపల్లి కార్యాలయంలో సువర్ణ రాజుకి అందజేశారు.