కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కార్య నిర్వహణ అధికారిగా, ఉప కమిషనర్గా నల్లం చక్రధర్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా ఆయనకు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ చక్రధర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.