VSP: విశాఖ రుషికొండ బీచ్ ప్రాంగణాన్ని శాప్ ఛైర్మన్ ఏ.రవి నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వాటర్ స్పోర్ట్స్ కోసం కేటాయించిన స్థలాన్ని జగన్ స్వార్థానికి ఉపయోగించారన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట రాజకీయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ వాటర్ స్పోర్ట్స్‌కి పూర్వ వైభవం తీసుకువస్తాం అన్నారు.