KRNL: తూర్పుగోదావరి జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాల బాలికల రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా షూటర్లు పథకాలు సాధించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య కోరారు. శుక్రవారం రైఫిల్ షూటింగ్ అకాడమీలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు రైఫిల్ షూటింగ్ కార్యదర్శి ఎంఎండీ బాషా బహుమతులు అందజేశారు.