KDP: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ దేవస్థాన అర్చక స్వాములు, అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు.